కన్నీళ్లు ఇచ్చి తెలంగాణ ప్రజలను కేసీఆర్​ మోసం చేశారు: ప్రధాని మోది

కన్నీళ్లు ఇచ్చి తెలంగాణ ప్రజలను కేసీఆర్​ మోసం చేశారు: ప్రధాని మోది


తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అన్నీ పార్టీలు ప్రచార జోరును పెంచాయి.  మహబూబాబాద్​ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.  కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ తెలంగాణను మోసం చేశాయన్నారు.  నీళ్లు, నిధులు, నియామకాలని అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు ఇచ్చి.. మోసం చేశారన్నారు.  నియామకాలకు మొత్తం కేసీఆర్​ కుటుంబానికే పరిమితమయ్యాయన్నారు.   తెలంగాణకు ఫామ్​ హౌస్​ సీఎం అవసరంలేదన్న  ప్రధాని మోదీ ... బీజేపీతో దోస్తి చేయాలనిర్​ ఢిల్లీ వచ్చారన్నారు.  బీఆర్​ఎస్​ ను ఎన్డీఏలో చేర్చుకోలేదని తనను బీఆర్ఎస్​ నేతలు తిడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్​ తమ దరిదాపుల్లోకి రానివ్వమన్నారు. 

బీఆర్ఎస్​ ప్రభుత్వంలో అనేక  స్కాంలు జరిగాయి.. తెలంగాణలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు చేస్తామన్నారు. ల్యాండ్​, లిక్కర్​, పేపర్​ మాఫియాలను జైలుకు పంపిస్తామన్నారు. తెలంగాణలో కొత్త చరిత్ర లిఖించబోతుందని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో డబుల్​ ఇంజన్​ సర్కార్​ రావాలన్నారు.  ఫామ్​ హౌస్​ సీఎం  తొలగాలన్నారు.  ఇప్పటికే సమ్మక్క సారలమ్మ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించామన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.  తెలంగాణ అభివృద్ది చెందాలంటే డబుల్​ ఇంజన్​ సర్కార్​ రావాలని మహబూబాబాద్​ ఎన్నికల సభలో ప్రధాని మోదీ తెలిపారు.