విశాఖపట్నం: ఆంద్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే మైధానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం మొదట్లో తెలుగులో మాట్లాడి.. ప్రజలను ఆకట్టుకున్నారు. ‘‘ప్రియమైన సోదర సోదరిమణులారా నమస్తే.. అందమైన విశాఖను చూస్తే నా మనసు పులకరిస్తోంది. శ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఉన్న భూమి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు తిరిగిన ప్రాంతం. తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం. పారిశ్రామికంగా.. పర్యాటకంగా.. దేశాభివృద్ధిలో అత్యం త కీలకమైన పాత్ర కలదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని ప్రధాని మోడీ చెప్పారు.
మూడు సార్లు భారత్ మాతా కీ జై..
ప్రసంగం మొదలు పెట్టే ముందు ప్రధాని మోడీ సభకు వచ్చి ప్రజలందరితో మూడు సార్లు భారత్ మాతా కీ జై.. అంటూ నినదింపజేశారు. పరాక్రమ భారత దేశం కోసం, విజయవంతమైన భారత్ కోసం, వీర జవాన్ల కోసం అంటూ మూడు సార్లు ఆయన ‘భారత్ మాతా కీ జై’ చెప్పించారు.