మళ్లీ వస్తున్న మోదీ.. సిటీలో మరో సభ

మళ్లీ వస్తున్న మోదీ.. సిటీలో మరో సభ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరితం ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల అగ్రనాయకులు కూబి ప్రచారంలో పాల్గొనున్నారు. నిన్న(2023,నంబర 7, మంగళవారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన  ప్రధాని మోదీ.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ గర్జన సభలో పాల్గొని ప్రసంగించారు. ఒకరోజు గ్యాప్ లో మరోసారి మోదీ హైదరాబాద్ కు రానున్నారు. 

ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న సభకు మోదీ హాజరుకానున్నారు. ఈ నెల11న సాయంత్రం 4.45 నిమిషా మోదీ లకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. 5 గంటలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోని సాయంత్రం 5.40వరకు 40 నిమిషాల పాటు సభలో పాల్గొననున్నారు. అనంతరం 5.55 నిమిషాలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట నుంచి మోదీ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు.