
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. గణపతి పూజతో ప్రారంభోత్సవ వేడుక మొదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కలిసి పూజా కార్యక్రమాలు చేశారు.
పూజా కార్యక్రమం తర్వాత సెంగోల్ కు మోడీ సాష్టాంగ నమస్కారం చేశారు. వేద పండితులు సెంగోల్ ను అందజేశారు. స్పీకర్ కుర్చీ దగ్గర సెంగో ల్ ను ప్రతిష్టించారు. అనంతరం మోడీ, స్పీకర్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు శాలువతో సన్మానించారు. అనంతరం పార్లమెంట్ భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు మోడీ. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
కొత్త పార్లమెంట్ విశేషాలు
- 2020 డిసెంబర్ 10న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకస్థాపన చేశారు.
- పాత పార్లమెంట్ భవనంలో లోక్‌సభ 545, రాజ్యసభలో 250 మంది సభ్యులు కూర్చునే సీటింగ్ కెపాసిటి ఉండేది.
- కొత్త భననంలో లోక్‌సభ 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే సీటింట్ కెపాసిటీని ఏర్పాటు చేశారు.
- కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో 64,500 చదరపు మీటర్లు స్థలంలో నిర్మించారు.
- సెంట్రల్ విస్తా భవన సముదాయ వరుసక్రమంలో త్రిభుజాకారంలో పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టారు. దీనిలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, రాజ్యాంగ బద్ధ సంస్థల కార్యాలయాలు ఉంటాయి.
- కొత్త లోక్‌సభ ఛాంబర్‌ను జాతీయ పక్షి నెమలి ఆకృతిలో నిర్మించారు.
- రాజ్యసభ ఛాంబర్‌ను జాతీయ పుష్పం ఆకృతిలో నిర్మించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో నిర్మాణం భారతీయ నిర్మాణ వారసత్వం ప్రతిబింబించేలా నిర్మించినట్లు తెలుస్తోంది.