కార్మికులకు రూ.3వేల పెన్షన్ : రేపే స్కీమ్ ప్రారంభం

కార్మికులకు రూ.3వేల పెన్షన్ : రేపే స్కీమ్ ప్రారంభం

ఢిల్లీ : కేంద్రం మరో సంక్షేమ పథకాన్ని రేపు మార్చి 5 మంగళవారం ప్రారంభించబోతోంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు రూ.3వేల నెలవారీ పెన్షన్ అందించే ‘ప్రధానమంత్రి శ్రమయోగి మన్ ధన్ యోజన’ స్కీమ్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు గుజరాత్ లో ప్రారంభించబోతున్నారు. గుజరాత్ పర్యటనలో ఇవాళ తొలిరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మోడీ. అహ్మదాబాద్ లో ఫస్ట్ ఫేజ్ మెట్రో రైలును ప్రారంభించారు. 40 కి.మీ.కు పైగా పొడవున్న ఈ మెట్రో రైలులో.. 6.5 కి.మీ. అండర్ గ్రౌండ్ రైలు మార్గం కూడా ఉంది.

మంగళవారం గాంధీనగర్ లో పర్యటించనున్న ప్రధానమంత్రి కార్మికులకు పెన్షన్ స్కీమ్ ప్రారంభించబోతున్నారు. రూ.15వేలు అంతకంటే తక్కువ నెలవారీ ఆదాయం ఉన్న కార్మికులు ఈ పెన్షన్ స్కీమ్ కు అర్హులు. కార్మికులు తమ ఏజ్ ను బట్టి… స్వల్ప మొత్తాన్ని కేంద్రానికి నెలవారిగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన కార్మికులకు నెల నెలా రూ.3వేల పెన్షన్ ను కేంద్రం PMSYS కింద అందిస్తుంది. దేశమంతటా ఉన్న 10కోట్ల మందికి ఈ పథకంతో లబ్ది కలుగుతుందని కేంద్రం చెబుతోంది.