ఎన్డీఏకు దేశ హితమే అన్నింటికంటే ముఖ్యం: మోడీ

ఎన్డీఏకు దేశ హితమే అన్నింటికంటే ముఖ్యం: మోడీ

ఎన్డీఏకు దేశ హితమే అన్నింటికంటే ముఖ్యమని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ .ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఎన్డీఏ పక్ష భేటీ జరిగింది. ఈ భేటీకి బీజేపీ, మిత్రపక్షాలు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా.. ఎన్డీఏ పక్ష నేతలు, ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీఏ పక్షనేతగా కూటమిలోని ఎంపీలంతా కలిసి మోడీని ఎన్నుకున్నారు. మోదీ పేరును ముందుగా అమిత్‌షా ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ,  రాంవిలాస్‌ పాశ్వన్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు  బలపరిచారు. తర్వాత మోడీ మాట్లాడుతూ.. ఎన్డీయే పక్ష నేతగా తనని ఎన్నుకున్నందుకు కూటమికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు మరోసారి తనపై నమ్మకం ఉంచారని..వారి ఆశయాలను నెరవేరుస్తానని అన్నారు. ఎండలు,వడగాలులు లెక్క చేయకుండా ఓటు వేశారన్నారు. ఈ సారి అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదయిందన్నారు. పార్లమెంటుకు ఈ సారి అత్యధికంగా మహిళా ఎంపీలు ఎన్నికయ్యారని చెప్పారు.ఎన్నికల ప్రచార స్థలాలను పుణ్య స్థలాలుగా భావించానని అన్నారు మోడీ.