పేదల కష్టార్జితాన్ని చిట్ ఫండ్ సంస్థలు దోచేశాయి : మోడీ

పేదల కష్టార్జితాన్ని చిట్ ఫండ్ సంస్థలు దోచేశాయి : మోడీ

బెంగాల్ బీజేపీతోనే ఉందన్నారు ప్రధాని మోడీ. బెంగాల్ లోని బునియాద్ పూర్ బహిరంగ సభలో మాట్లాడారు. బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల హత్యలను ఖండిస్తున్నానన్నారు. అవినీతి చేస్తున్న వారికి శిక్ష ఓటు రూపంలో వేయాలని పిలుపునిచ్చారు. పేదల కష్టార్జితాన్ని చిట్ ఫండ్ సంస్థలు దోచేశాయన్నారు. అవినీతిపరులకు మద్దతుగా మమత ధర్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం విదేశాల నుంచి కూడా ప్రచారానికి మమత పిలిపించుకుంటున్నారని అన్నారు.