యూపీలో మోడీ ఎన్నికల ప్రచారం

యూపీలో మోడీ ఎన్నికల ప్రచారం

ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ. యూపీలోని డియోరిలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికలు 'రాష్ట్రవాదీలు.. పరివార్‌వాదీల' మధ్య జరుగుతున్నాయన్నారు ప్రధాని. యూపీలో వైద్య పరిస్థితులపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వైద్యం కోసం అత్యవసర పరిస్థితుల్లో గోరఖ్‌పూర్‌కు వాహనాలను ఎలా తీసుకెళ్లాల్సి వచ్చిందో గుర్తుంచుకోవాలన్నారు ప్రధాని. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం ఇక్కడి ప్రజల వైద్య అవసరాలను పట్టించుకోలేదన్నారు. బ్రెయిన్ ఫీవర్‌తో చాలా మంది అమాయక పిల్లలు చనిపోయారన్నారు.

కొంతకాలం క్రితం, డియోరియాలోని మహర్షి దేవ్రాహా బాబా అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీతో సహా 9 మెడికల్ కాలేజీలకు UPలో శంకుస్థాపన చేశానని గుర్తు చేసుకున్నారు ప్రధాని మోడీ. ఈ మెడికల్ కాలేజీని ఇంతకు  ముందే నిర్మించి ఉండవచ్చు, కానీ ఈ 'పరివార్ వాది పార్టీలు' ప్రజలకు ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. తాము యూపీలో 18 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసామన్నారు. 20 కాలేజీలకు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. గోరఖ్‌పూర్‌లో AIIMSని  ఏర్పాటు చేసామన్నారు ప్రధాని. పేద పిల్లలు వారి స్వంత భాషలో మెడికల్, ఇంజనీరింగ్ చదివేలా కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు మోడీ.