ధాన్యం కోనుగోలులో జాప్యం చేయవద్దు : కలెక్టర్ హైమావతి

ధాన్యం కోనుగోలులో జాప్యం చేయవద్దు : కలెక్టర్ హైమావతి
  •     కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: ధాన్యం కొనుగోలులో జాప్యం చేయవద్దని కలెక్టర్​హైమావతి నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం మండలంలోని జక్కాపూర్ గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు సెంటర్​ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధాన్యం తేమశాతం పరిశీలించిన కలెక్టర్​వెంటనే గన్నీ సంచుల్లో ధాన్యం నింపి లారీల్లో లోడ్ చేయించాలని సిబ్బంది ని ఆదేశించారు. 

రోజు రెండు లారీల చొప్పున రామంచ గ్రామ హనుమాన్ మిల్ కు ధాన్యం పంపిస్తున్నామని సెంటర్ సిబ్బంది కలెక్టర్ కి తెలుపగా కొనుగోలులో వేగం పెంచాలని సూచించారు. గుర్రాలగొంది జడ్పీహెచ్ఎస్ స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. కూర నాణ్యత మెరుగుపరచాలని, రుచికరంగా వండాలని సిబ్బందిని ఆదేశించారు. 

అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్​సీని సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. మెడికల్ ఆఫీసర్ బాపురెడ్డి డ్రై డే కి వెళ్లారని, ఇతర సిబ్బంది సునీత, సుధారాణి ఫీల్డ్ కి వెళ్లినట్లుగా సిబ్బంది చెప్పగా ఆరా తీయాలని తహసీల్దార్​ను ఆదేశించారు. మొక్కుబడిగా ఓపీ రిజిస్టర్ రాస్తూ, ఫీల్డ్, మీటింగ్స్ పేరుతో విధులు నిర్వహించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ నీ ఫోన్ ద్వారా హెచ్చరించారు. 

ఆరోగ్య కార్యక్రమాల పనితీరు మెరుగుపరచాలి 

ఆరోగ్య కార్యక్రమాల పనితీరు మెరుగుపరచుకోవాలని, జిల్లాను అన్ని ఆరోగ్య కార్యక్రమాల సేవలో మొదటి స్థానంలో నిలిపేందుకు సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. పీహెచ్​సీలలో పనిచేస్తున్న వైద్య అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీబీ స్క్రీనింగ్ లో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపినందుకు అభినందించారు. 

రాష్ట్రీయ బాల స్వస్థ  కార్యక్రమంలో భాగంగా హాస్టల్స్ లో ప్రత్యేక ఎనిమియా స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించాలన్నారు. డీఎంహెచ్​వో ధనరాజ్, డిప్యూటీ డీఎంహెచ్​వో శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ వినోద్ బాబ్జి  పాల్గొన్నారు.