వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ

వరల్డ్ కప్ చివరి యుద్ధం.. నవంబర్ 19వ తేదీ ఆదివారం.. మధ్యాహ్నం ప్రారంభం కాబోతుంది. ఫైనల్ మ్యాచ్ ఇండియా ఆడుతుండటంతో.. దేశం మొత్తం ఇప్పుడు గుజరాత్ వైపు చూస్తుంది. దీనికి కారణం.. నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగటమే.. ఈ ఫైనల్ మ్యాచ్ కు మరో ఎట్రాక్షన్ కూడా ఉంది.. ప్రధాని మోదీ హాజరవుతున్నారు.. మ్యాచ్ మొత్తం చూడనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. 

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ హాజరు అవుతుండటంతో.. క్రికెట్ అభిమానులే కాదు.. అన్ని రాజకీయ పార్టీల చూపు ఇప్పుడు అటువైపు మళ్లింది. అందులోనూ ఆదివారం కావటంతో మరింత హైప్ క్రియేట్ అవుతుంది. ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ మ్యాచ్ కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 

క్రికెట్ మ్యాచ్ కు మోదీ హాజరుకావటం ఇది రెండో సారి. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ కు హాజరయ్యారు మోదీ. అది కూడా ఇదే స్టేడియంలో కావటం విశేషం. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మొత్తాన్ని చూడనున్నారు మోదీ..