టాటా గ్రూప్‌‌పై మోడీ ప్రశంసలు

టాటా గ్రూప్‌‌పై మోడీ ప్రశంసలు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌‌లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తొలి వేవ్‌లో కంటే రెట్టింపుగా ఉంది. వైరస్ వేగంగా వ్యాప్తి అవుతుండటంతో ఆస్పత్రుల్లో చేరే పేషెంట్ల సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ దేశీ కంపెనీ టాటా గ్రూప్ తానున్నామంటూ ముందుకొచ్చింది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆస్పత్రులకు నేరుగా లిక్విడ్ ఆక్సిజన్‌‌ను టాటా గ్రూప్ సరఫరా చేస్తోంది. రోజుకు 200 నుంచి 300 టన్నుల ఆక్సిజన్‌‌ను పంపిణీ చేస్తూ బాసటగా నిలుస్తోంది. దీంతో టాటా సంస్థపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. టాటా గ్రూప్ కారుణ్య గుణం, సేవా తత్పరత గొప్పదని మోడీ ట్వీట్ చేశారు. దేశ ప్రజలందరూ కలసికట్టుగా పోరాడితే కరోనాపై విజయం సాధించగలమని పేర్కొన్నారు.