మాస్క్ పెట్టుకోని మంత్రి.. అడిగితే మోడీపై నెపం

మాస్క్ పెట్టుకోని మంత్రి.. అడిగితే మోడీపై నెపం

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కొద్ది రోజులుగా డైలీ కేసులు రెండు లక్షలకు పైగా వస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే థర్డ్ వేవ్ పీక్ కు చేరుతుందని కేంద్రం హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి. మాస్క్ పెట్టుకోని వారిపై జరిమానాలు విధిస్తున్నాయి. కానీ పొలిటికల్ మీటింగ్స్, సభల్లో పాల్గొంటున్న రాజకీయ నేతలు మాత్రం ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో ఆ రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి ఉమేశ్ కట్టి మాస్క్ పెట్టుకోకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఏకంగా ప్రధాని మోడీపై నెపం నెట్టేశారు. మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అని ప్రధాని మోడీ చెప్పలేదని, ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయానికే వదిలేశారని చెప్పుకొచ్చారు ఆ మంత్రి. మాస్కు పెట్టుకోవాలా? వద్దా? అన్నదానిపై ఎవరి ఇష్టం వారిదని, తాను మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని తన అభిప్రాయమని చెప్పారు. అందుకే తాను మాస్క్ పెట్టుకోలేదని, అందులో సమస్యేం లేదని మంత్రి ఉమేశ్ అన్నారు.

22 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు

మరోవైపు కర్ణాటకలో కరోనా పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 22.3 శాతానికి పెరిగిందని హెల్త్ మినిస్టర్ డాక్టర్ కె.సుధాకర్ తెలిపారు. ఇవాళ ఒక్క రోజులో రాష్ట్రంలో 41 వేల 457 కరోనా కేసులు నమోయ్యాయని, 20 మంది మరణించారని పేర్కొన్నారు. ఒక్క బెంగళూరులోనే 25,595 మందికి కొత్తగా కరోనా సోకగా, ఏడుగురు మృతి చెందారని చెప్పారు. ప్రస్తుతం కర్ణాటకలో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల 50 వేలు దాటిందని మంత్రి సుధాకర్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణలో తొలి మహిళా వర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజ్

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి హరీశ్ రావు లేఖ

ఇంజినీరింగ్ కాలేజీలో 100 మందికి పైగా కరోనా