2023 –24 లో పీఎన్‌‌బీ ప్రాఫిట్ రూ.7,500 కోట్లు!

2023 –24 లో పీఎన్‌‌బీ ప్రాఫిట్ రూ.7,500 కోట్లు!
  •  గైడెన్స్ మెరుగుపరిచిన బ్యాంక్‌‌

న్యూఢిల్లీ: డిసెంబర్ క్వార్టర్‌‌‌‌కి గాను అదిరిపోయే రిజల్ట్స్ ప్రకటించిన పంజాబ్  నేషనల్ బ్యాంక్ (పీఎన్‌‌బీ)  ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని రూ.7  వేల నుంచి రూ.7,500 కోట్ల ప్రాఫిట్‌‌తో ముగిస్తామని చెబుతోంది. గతంలో వేసిన రూ.6 వేల కోట్ల అంచనాను తాజాగా సవరించింది. బ్యాంక్ నికర లాభం క్యూ3 లో 253 శాతం పెరిగి రూ.2,223 కోట్లుగా రికార్డయ్యింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో రూ.5,230 కోట్ల నికర లాభాన్ని సాధించింది.

మార్చి క్వార్టర్ (క్యూ4) లో రూ. 2 వేల  కోట్ల నికర లాభం వస్తుందని అంచనా వేస్తున్నామని పీఎన్‌‌బీ ఎండీ అతుల్ కుమార్ గోయల్ అన్నారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్‌‌కు గోల్డెన్ ఇయర్ అని కిందటేడాది జరిగిన షేర్‌‌‌‌ హోల్డర్ల మీటింగ్‌‌లో  గోయల్ పేర్కొన్నారు. గ్రోత్‌‌ పెంచేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నామని అప్పుడు చెప్పారు.   డిపాజిట్లు, లోన్లు పెంచడం, రికవరీల ద్వారా అసెట్ క్వాలిటీని మెరుగుపరచడంపై ఫోకస్ పెట్టామన్నారు.