వర్ని, వెలుగు: హైదరాబాద్‌లోని జలసౌధలో శనివారం భారీనీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటి అయ్యారు. మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు, జాకోరా, చందూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పనులకు సంబంధించిన వివరాలను మంత్రికి అందజేయగా సానుకూలంగా స్పందించారన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు ఎమ్మెల్యే పోచారం పేర్కొన్నారు.
