నిజామాబాద్ సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ సంక్షిప్త వార్తలు
  • బాన్సువాడలో పోచారమే పోటీ చేస్తారు
  • టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి సురేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి

కోటగిరి, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ  నుంచి  స్పీకర్ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డే పోటీ చేస్తారని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి పోచారం సురేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి తేల్చి చెప్పారు. మండలంలోని ఎత్తొండలో గురువారం 30 మంది యువకులు ఆయన ఆధ్వర్యంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా సురేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారం స్పీకర్ పోచారం కృషితో బాన్సువాడ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. పోచారం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి వస్తున్నారన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థిపై కొందరు లేనిపోని ప్రచారం చేస్తున్నారన్నారు. నెక్ట్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనే ఉంటారని, అనాదిగా వస్తున్న స్పీకర్ ఓడిపోతాడనే చరిత్రను తిరగరాద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోటగిరి టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ అధ్యక్షుడు ఎజాస్ ఖాన్, సర్పంచ్ సాయిబాబా, ఎంపీటీసీ ఫారూక్‌‌‌‌, కేశ వీరేశం, మండల్ కో ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ యూత్ వైస్ ప్రెసిడెంట్ తేజ, కిశోర్ పటేల్, ఆనంద్, విజయ్ పటేల్ పాల్గొన్నారు.

  • ఆటలతో మానసికోల్లాసం
  • కామారెడ్డి కలెక్టర్​ జితేష్ వి పాటిల్

కామారెడ్డి, వెలుగు: ఆటలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని కామారెడ్డి కలెక్టర్ ​జితేష్ వి పాటిల్ చెప్పారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా యూత్ వెల్ఫేర్  శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించిన ఆటల పోటీలను గురువారం ఇందిరా గాంధీ స్టేడియంలో  ఎస్పీ శ్రీనివాస్​రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఎంప్లాయీస్​ మధ్య ఆటల పోటీలు స్నేహ బంధాన్ని పెంపొందిస్తాయన్నారు.  కలెక్టరేట్​ స్టాఫ్‌‌‌‌, పోలీస్ స్టాఫ్‌‌‌‌ మధ్య పోటీలు జరిగాయి.  అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్​దొత్రే, చంద్రమోహన్, ఆఫీసర్లు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కళాభారతిలో విజేతలకు  బహుమతులు అందజేశారు. ఈ ప్రోగ్రామ్‌‌‌‌లో ప్రభుత్వ విప్ గోవర్ధన్, లైబ్రరీ జిల్లా చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్​చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ జాహ్నవి, డీపీవో శ్రీనివాస్‌‌‌‌రావు, డీఎల్పీవో సాయిబాబా పాల్గొన్నారు. 

  • నష్టపోయిన రైతులను అదుకోవాలి

ఇటీవల వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు కోరారు. ఈమేరకు గురువారం కలెక్టర్ జితేష్ వి పాటిట్‌‌‌‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ  కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్‌‌‌‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్​లీడర్ మోహన్‌‌‌‌రెడ్డి, లీడర్లు నాగయ్య, మనోహర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శివాజీ, సుదర్శన్ పాల్గొన్నారు. 

రూ.2 ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌

నవీపేట్‌‌‌‌, వెలుగు : రేషన్ బియ్యానికి సెంట్రల్ గవర్నమెంట్‌‌‌‌ రూ.32 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2 ఇచ్చి సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నాడని బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ మోహన్‌‌‌‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాల్లేశ్వర్, తుంగిని, నిజాంపూర్, లింగపూర్ గ్రామాల్లో నిర్వహించిన గడపగడపకు బీజేపీ ప్రోగ్రామ్‌‌‌‌లో సీనియర్‌‌‌‌‌‌‌‌ నేత మేడపాటి ప్రకాశ్‌‌‌‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం గ్రామాల అభివృద్ధికి ఫండ్స్ ఇస్తుంటే.. ఇక్క కేసీఆర్ మాత్రం డంపింగ్ యార్డ్, శ్మశానవాటిక, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఉపాధిహామీ పథకలకు టీఆర్ఎస్ రంగులు వేస్తూ తమ పథకాలుగా చెప్పుకుంటున్నాడని ఆరోపించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ను సాగనంపే రోజు దగ్గరలో ఉందన్నారు. అంతకుముందు నాల్లేశ్వర్‌‌‌‌‌‌‌‌లో మృతి చెందిన కార్యకర్త చిన్నయ్య ఫ్యామిలీని పరామర్శించారు. కార్యక్రమంలో నాల్లేశ్వర్ సర్పంచ్ సరిన్, రెంజల్ ఎంపీపీ రజిని కిషోర్, జిల్లా నాయకులు మేక సంతోష్, ఎంపీటీసీ రాధ, నవీపేట్, రెంజల్ పార్టీ ప్రెసిడెంట్‌‌‌‌లు అధినాథ్, రాజు, నాగేశ్వరరావు, సుదర్శన్, ఆనంద్, చిన్నయ్య పాల్గొన్నారు. 

హ్యాండ్​ రైటింగ్‌‌‌‌పై స్టూడెంట్లకు శిక్షణ

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌‌‌‌లోని జడ్పీ బాయ్స్​హైస్కూల్‌‌‌‌లో చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం హ్యాండ్ రైటింగ్‌‌‌‌పై స్టూడెంట్లకు శిక్షణ ఇచ్చారు. హ్యాండ్​ రైటింగ్ నిపుణుడు వై.మల్లికార్జున్‌‌‌‌రావు 9,10వ తరగతి పిల్లలకు చేతి రాత మెరుగు పరుచుకునేలా  మెలకువలు వివరించారు. విద్యా స్ఫూర్తి కార్యక్రమాన్ని ప్రారంభించి 15 ఏళ్లు పూర్తయిన  సందర్భంగా ట్రస్ట్​ వ్యవస్థాపకులు రాష్ట్ర ఎలక్షన్  కమిషనర్ చిట్ల పార్ధసారథి స్టూడెంట్ల కోసం హ్యాండ్ రైటింగ్​ట్రైనింగ్ ఏర్పాటు చేయించారని కన్వీనర్​నర్సింలు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో దుర్గాప్రసాద్, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంఈవో పింజ రాజగంగారాం, హెచ్‌‌‌‌ఎం కవిత, టీచర్లు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు బీఎల్వో డ్యూటీలొద్దు

పిట్లం, వెలుగు: అంగన్‌‌‌‌వాడీలను బీఎల్వో బాధ్యతల నుంచి తప్పించాలని అంగన్‌‌‌‌వాడీ టీచర్స్‌‌‌‌ అండ్‌‌‌‌ హెల్పర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేశ్‌‌‌‌ గొండ డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ మేరకు మద్నూర్​ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌‌‌‌వాడీలు గురువారం బాన్సువాడ ఆర్డీవో ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేశ్‌‌‌‌ మాట్లాడుతూ అంగన్‌‌‌‌వాడీలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. చిన్నపిల్లల సంరక్షణ, ఆరోగ్య లక్ష్మి పథకంలో బాలింతలు, గర్భిణులకు ఐదు రకాల వంటలను అందించాల్సి ఉంటుందన్నారు. అదనంగా బీఎల్వో బాధ్యతలు అప్పగించడం వారికి భారంగా మారిందన్నారు. కార్యక్రమంలో మద్నూర్ ప్రాజెక్టు అంగన్‌‌‌‌వాడీ నాయకులు  చంపబాయి, అనసూయ, శారద, మహానంద, రేణుక, రాధ, సునంద పాల్గొన్నారు.

కామారెడ్డిలో అడ్వకేట్ల దీక్షలు

కామారెడ్డి, వెలుగు: అడ్వకేట్ల రక్షణ యాక్ట్‌‌‌‌ను గవర్నమెంట్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఫెడరేషన్​ ఆధ్వర్యంలో  మూడు రోజుల పాటు చేపట్టనున్న నిరసన దీక్ష గురువారం ప్రారంభమైంది. జిల్లా కోర్టు ఎదుట అడ్వకెట్లు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా ప్రెసిడెంట్ అమృతరావు మాట్లాడుతూ వకీళ్ల హత్యకు పాల్పడిన నిందితులను ఫాస్ట్​ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి శిక్షించాలన్నారు. ప్రతినిధులు జగన్నాథం, వెంకట్రాంరెడ్డి, నర్సింహ్మారెడ్డి, బండారం సురేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, చింతల గోపి, జడల రంజిత్, శ్రీధర్‌‌‌‌‌‌‌‌, భిక్షపతి,
నారాయణ పాల్గొన్నారు.