పోక్సో కేసులో 20 ఏండ్లు జైలు

పోక్సో కేసులో 20 ఏండ్లు జైలు

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాలో పోక్సో కేసులో నేరస్థుడిగా రుజువైన వ్యక్తికి 20 ఏండ్లు జైలు శిక్ష పడింది. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం సజనాపూర్​కు చెందిన కొంకలి ఆనంద్ స్థానికంగా ఉండే బాలిక(15)కు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం తల్లిదండ్రులకు తెలిసింది. 2021, డిసెంబర్​22న బాలిక తల్లి ఆనంద్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అప్పటి ఎస్సై గోవర్ధన్ కేసు నమోదు చేయగా, సీఐ శ్రీకాంత్​రెడ్డి చార్జ్​షీట్ వేశారు. నారాయణపేట జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. నేరం రుజువు కావడంతో ఆనంద్ కు 20 ఏండ్లు జైలు శిక్షతోపాటు రూ.21వేల జరిమానా విధిస్తూ జడ్జి మహ్మద్​రఫీ తీర్పు ఇచ్చారు. అలాగే బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు.