బాంబే హైకోర్టులో వరవరరావుకు ఊరట

బాంబే హైకోర్టులో వరవరరావుకు ఊరట

15 రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచి అన్ని చికిత్సలు చేయించాలని ఆదేశించిన బాంబే హైకోర్టు

వైద్య చికిత్సల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్న హైకోర్టు

ముంబై: ప్రముఖ రచయిత, కవి వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. తలోజ జైలులో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని వేసిన పిటిషన్ పై ఇవాళ వాదనలు విన్న బాంబే హైకోర్టు వరవరరావును నానావతి ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది. అంతేకాదు వరవరరావు చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని.. కోర్టుకు  తెలియజేయకుండా ఆయనను హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. అనారోగ్యంతో ఉన్న వరవరరావు దగ్గరకు హాస్పిటల్ లో చూసుకునేందుకు  కుటుంబ సభ్యులను అనుమతించాలని కోర్టు సూచించింది.

ఉగ్రవాద నిరోధక చట్ట కింద వరవరరావు ను 2018లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భీమా కోరేగావ్ కేసులో ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద తీవ్ర అభియోగాలు మోపారు. అప్పటి నుండి ఆయన జైలులోనే ఉంటున్నారు. ప్రస్తుతం తలోజ జైలులో ఉంటున్న ఆయనకు గతంలో కరోనా లక్షణాలు కనిపించంతో ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తీవ్ర వయోభారంతో.. మంచానికే పరిమితమైన పరిస్థితిలో ఉంటున్నారని కోర్టును ఆశ్రయించగా.. పోలీసుల అభ్యంతరంతో బెయిల్ రాలేదు. తాజాగా వరవరరావు తరపున ఆయన భార్య వేసిన పిటిషన్ తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ వాదించారు. వరవరరావు 80 ఏళ్ల వయోభారంతో ఉన్నారని.. జేజే ఆస్పత్రిలో చేర్పించినప్పుడు తలకు గాయమైందని వివరించారు. అలాగే గతంలోనే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని న్యాయవాది తెలియజేశారు. జైలులో ఎలాంటి చికిత్స అందించడం లేదని వాదించగా స్పందించిన బాంబే హైకోర్టు వయోభారంతో అనారోగ్యంతో ఉన్న వరవరరావుకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది.

Read more news

మనస్పర్థలతో ఫ్రెండ్స్ మధ్య గ్యాప్.. ఈ గ్యాప్ రావొద్దంటే..

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు