పటాన్ చేరులో దారి దోపిడీ.. మహిళలు, వృద్దులే టార్గెట్

పటాన్ చేరులో దారి దోపిడీ.. మహిళలు, వృద్దులే టార్గెట్

సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ దొంగలు హడలెత్తిస్తున్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, వృద్దులను టార్గెట్ చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో ఆ దారిలో ఒంటరిగా ప్రయాణించాలంటేనే జనాలు భయపడుతున్నారు. 

కొందరు దుండగులు.. ఆటో డ్రైవర్ ల నటించి ప్యాసింజర్ లను ఎక్కించుకొని కొద్దీ దూరం తీసుకెళ్లి.. మహిళల మెడలో ఉన్న బంగారు నగలు లాక్కొని పారిపోతున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం కూడా ఇస్నా పూర్  క్రాస్ రోడ్ దగ్గర వడ్ల మనెమ్మ(60) అనే వృద్దురాలిని నమ్మించి.. ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లు లాక్కొని పారిపోయారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి తులమున్నర బంగారు గుండ్లు, ఆటో (TS 34 TA 5558 )ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అమీన్ పూర్ కు చెందిన జెరిపాటి యాదయ్య(29), బొంత కృష్ణ(24), బొంత రేణుక(22)లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా చందనగర్, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాత నేరస్తులని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.