లక్ష డిపాజిట్ చేస్తే లక్షన్నర..

లక్ష డిపాజిట్ చేస్తే లక్షన్నర..

డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియాలో ఉన్న బుక్స్ స్కాన్ చేస్తే డబ్బులు ఇస్తామని నిరుద్యోగులు టార్గెట్ గా నిందితులు పని చేసినట్లు పోలీసులు చెప్పారు. 10 వేల పేపర్లు స్కాన్ చేస్తే 50 వేల రూపాయలు ఇచ్చేలా స్కీం ఏర్పాటు చేశారన్నారు. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే లక్షా 50 వేలు వస్తాయని నమ్మించారని పోలీసుల వెల్లడించారు. రాష్ట్రంలో 623 మంది 15 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. డమ్మీ డైరెక్టర్లుగా ఉన్న సయ్యద్ సమీర్ ఉద్దీన్, ఆశిష్ కుమార్ లను పోలీసలు అరెస్ట్ చేశారు. 

కాగా, నిందితులు బంజారా హిల్స్ లో ఆఫీస్ ఓపెన్ చేసి, ఉద్యోగులను నియమించుకున్నారని పోలీసులు తెలిపారు, వారు కూడా ఇందులో పెట్టుబడలు పెట్టారని నిర్ధారించారు. ఈ స్కీంలో చేరాలంటే లక్ష రూపాయలు ముందస్తుగా డిపాజిట్ తీసుకున్నారు, లక్ష పెడితే లక్ష యాభై వేల, 2 లక్షలు వరకు ఇచ్చారు. కొంత మంది 25 లక్షలు వరకు ఈ స్కీంలో పెట్టుబడులు పెట్టి మోసపోయారని పోలీసలు వెల్లడించారు. ఈ స్కీం ద్వారా వచ్చిన నగదుతో కొందరు నిందితులు ఢిల్లీకి పరారు అయ్యారని.. గతంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసలు చెప్పారు.