సీఎంవో ప్రొటోకాల్ అధికారినంటూ మోసం .. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 

సీఎంవో ప్రొటోకాల్ అధికారినంటూ మోసం .. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 

ఎల్​బీనగర్, వెలుగు: సీఎం ఆపీసు(సీఎంవో)లో అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎల్​బీనగర్ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని భీమవరానికి చెందిన బుసి ప్రవీణ్​సాయి(23) కొంతకాలం కిందట సిటీకి వచ్చి వనస్థలిపురంలోని ద్వారకామయినగర్​లో ఉంటున్నాడు. బేగంపేటకు చెందిన వీరభద్ర అనే డ్రైవర్​కు ప్రవీణ్ సాయితో పరిచయం ఏర్పడింది.

తాను తెలంగాణ సీఎంవోలో పనిచేస్తానని, ప్రొటోకాల్ అడ్వయిజర్​అని ప్రవీణ్​ సాయి అతడితో చెప్పాడు. అబ్దుల్లాపూర్​మెట్ మండలం గండిమైసమ్మ ఆలయం వెనుక ఉన్న భూమిని చూపించి దాన్ని తక్కువ రేటుకు ఇస్తానని చెప్పి వీరభద్ర నుంచి రూ.7 లక్షల 10 వేలు వసూలు చేశాడు. అయితే, ఆ భూమిలో కొందరు వ్యక్తులు కన్ స్ట్రక్షన్ చేస్తండటంతో వీరభద్ర వెంటనే ప్రవీణ్​సాయిని అడిగాడు.

ప్రవీణ్​రెస్పాండ్ కాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన వీరభద్ర అబ్దుల్లాపూర్​మెట్ పీఎస్​లో కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కారు, సెల్ ఫోన్​ను సీజ్ చేశారు.  ప్రవీణ్ సాయి ఇలా పలువురిని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మంత్రుల ఫేక్ లెటర్ హెడ్స్​చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసేవాడని సమాచారం. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.