- ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు
జడ్చర్ల, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి..
జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని స్కూల్లో చదువుకుంటుండగా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడింది. దీనిపై ప్రిన్సిపాల్ కు బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఆమె ఈ విషయాన్ని దాచిపెట్టడంతో పాటు బాలికను భయభ్రాంతులకు గురి చేశారు.
దీంతో బాధితురాలు జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ కు ఫోన్ లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి ఈ ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని జడ్చర్ల పోలీసులను ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లేశ్ తెలిపారు.
