ట్యాంకులో శవమైన బాబుది హత్యే

V6 Velugu Posted on Jun 19, 2021

రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం చనిపోయిన రెండు నెలల బాలుడిది రాచకొండ పోలీసులు హత్యగా తేల్చారు. బాలుడి మేనత్తే, మేనమామే హత్యచేశారని పోలీసులు తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజ్ పూర్ గ్రామంలో శుక్రవారం ఓ బాలుడు ఇంటిపై ఉన్న ట్యాంకులో శవమై తేలాడు. ఆ బాలుడిని మేనత్త శ్వేత, మేనమామ రాజు హత్యచేసినట్లు గుర్తించారు. తల్లి పక్కన పడుకున్న బాబును అర్దరాత్రి చంపి.. ట్యాంకులో పడేశారు. తనకి పిల్లలు పుట్టకముందే.. తన ఆడపడుచుకు పిల్లలు పుట్టడంతో శ్వేత ఈ దారుణానికి పాల్పడింది. పిల్లల విషయమై శ్వేత.. అదే రోజు రాత్రి భర్తతో గొడవపెట్టుకుంది. అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడింది.

Tagged Rangareddy district, murder, Abdullapurmet, Anajpur, two months boy murder, dead body in water tank, aunt and uncle murders two months boy

Latest Videos

Subscribe Now

More News