
- నిందితుడి అరెస్ట్
భైంసా, వెలుగు: లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్లో ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన కేసును పోలీసులు ఛేందించారు. శనివారం భైంసాలో ఏఎస్పీ అవినాశ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 14న అబ్దుల్లాపూర్లో యమున అనే మహిళ రోడ్డు పక్కన పశువులను మేపుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆమెకు మాయమాటలు చెప్పి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు.
దీంతో బాధితురాలు లోకేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. నిందితుడిని ముథోల్ మండలం ఆష్ఠ గ్రామానికి చెందిన పిప్పెర విజయ్‌గా గుర్తించి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు గొలుసు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏఎస్పీ తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన ఎస్సై అశోక్, సిబ్బందిని అభినందించారు. ముథోల్ సీఐ మల్లేశ్ పాల్గొన్నారు.