పోలీసులే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది

పోలీసులే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది

ఉత్తర ప్రదేశ్‌లో సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (CAA) కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగిన సమయంలో ప్రభుత్వ ఆస్తులను పోలీసులే ధ్వంసం చేశారని ఆరోపించారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం CAA వ్యతిరేక నిరసనకారులను భయాందోళనలకు గురి చేయాలని చూస్తోందన్నారు.CCTV ఫుటేజ్‌లో పోలీసులు ఇళ్లపై దాడులు చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం,CCTV కెమెరాలను విరగ్గొట్టడం వంటి కేసులు నమోదయ్యాయన్నారు. పోలీసులు చేసిన విధ్వంసంపై ప్రభుత్వం ఎప్పుడు దర్యాప్తు చేసి…. ప్రజలకు పరిహారం ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు అఖిలేష్ యాదవ్.