
రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్‌గా భారీగా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు వారు గుర్తించారు. 8 కిలోల ఎపిడ్రిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా ఇతర రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
న్యూ ఇయర్ వేడుకల కారణంగా ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సప్లై చేస్తూ ఎవరైనా దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని రాచకొండ పోలీసులు సూచించారు.