17 ఏళ్ల తర్వాత డ్రోన్​ పట్టించింది

17 ఏళ్ల తర్వాత డ్రోన్​ పట్టించింది

పిల్లల్ని, ఆడవాళ్లను కిడ్నాప్‌‌ చేసి అక్రమంగా రవాణా చేసే నేరస్థుడతను. పోలీసులకు చిక్కాడు. సిచువాన్‌‌ ప్రావిన్స్‌‌లోని లేబర్‌‌ క్యాంప్‌‌లో శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ 2002లో టైం చూసి తప్పించుకున్నాడు. 17 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా మనుషులకు కూడా కనబడని యంగ్‌‌షన్‌‌ ప్రాంతంలోని ఓ ఇరుకైన గుహలో తలదాచుకుంటున్నాడు. అతడి పేరు సాంగ్‌‌ జియాంగ్‌‌. ఇప్పుడతనికి 63 ఏళ్లు. అతని గురించి సెప్టెంబర్‌‌లో పోలీసులకు సమాచారం అందింది. తన సొంతూరు యునాన్ ప్రావిన్స్‌‌ను ఆనుకుని ఉన్న కొండల్లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు పట్టుకునేందుకు ట్రై చేశారు. కానీ ఆ కాకులు దూరని కారడవిలో ఎంత ప్రయత్నించినా సాంగ్‌‌ జాడ కనుక్కోలేకపోయారు. ఇట్ల కాదనుకొని డ్రోన్‌‌తో ట్రై చేశారు. నీలం రంగు బోర్డు ఉన్న ఓ ప్రదేశాన్ని, దానికి దగ్గర్లోనే చెత్తను గమనించారు. ఇంకేముంది ఆ ప్రాంతానికి వెళ్లి సెర్చ్‌‌ చేయగా మనోడు దొరికాడు. ఏళ్లుగా జనాలతో మాట్లాడకపోవడంతో పోలీసులతో మాట్లాడేందుకు సాంగ్‌‌ కష్టపడ్డాడు. పక్కనే ఉన్న నది నుంచి ప్లాస్టిక్ బాటిళ్లతో అతడు నీళ్లు తెచ్చుకునే వాడని, చెట్ల కొమ్మలతో నిప్పు రాజేసేవాడని తెలిసింది.