
హైదరాబాద్ సరూర్ నగర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వృత్తి రీత్యా డ్రైవర్ అయిన భర్త.. డ్రైవింగ్ కోసం వెళ్లిన సమయంలో ప్రియుడితో వివాహేతర సంబంధం నడిపిస్తూ.. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. అందుకోసం టైమ్ కోసం ఎదురు చూస్తూ.. వినాయక చవతి అందుకు పర్ఫెక్ట్ టైమ్ అని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. రాత్రిపూట భర్తకు స్పాట్ పెట్టేసింది. గురువారం (ఆగస్టు 28) రాత్రి జరిగిన ఈ మర్డర్ కేసులో మరిన్ని సంచలన విషయాలను వెల్లడించారు పోలీసులు.
పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. నిందితురాలు చిట్టి (33) అనే వివాహితకు, భర్త శేఖర్ (40) తో 16 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీళ్లు గత కొన్నేండ్లుగా సరూర్ నగర్ లోని కోదండరాంనగర్ లో నివాసం ఉంటున్నారు. భర్త శేఖర్ భర్త వృత్తి రీత్యా కారు డ్రైవర్. వీళ్లకు ఒకపాప (16), బాబు (13) ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భర్త వృత్తి పై బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హరీష్ అనే యువకుడి తో అక్రమ సంబంధం పెట్టుకుంది భార్య చిట్టి. భార్య వ్యవహారం తెలిసిన భర్త.. చిట్టిని పలుమార్లు నిలదీయడమే కాకుండా మందలించాడు. దీంతో భర్త తనకు అడ్డు వస్తున్నాడని భావించిన చిట్టి.. భర్తను లేపేసేందుకు ప్లాన్ వేసుకుంది.
అందుకోసం ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని భావించి గురువారం ( ఆగస్టు 28) అనువైన సమయంగా ఫిక్సయ్యారు. ఎలాగో పాప హాస్టల్లో ఉంటుంది. వినాయక చవితి కావడంతో బాబు మండపం దగ్గర నిద్రిస్తూ ఉంటాడు. కాబట్టి గురువారం రాత్రి సరైన సమయంగా భావించి ప్రియుడిని రమ్మంది.
►ALSO READ | ఎంతపని చేశావు చిట్టీ.. హైదరాబాద్లో ప్రియుడితో కలిసి భర్తను చంపి.. నిద్రలోనే చనిపోయాడనీ పోలీసులకు ఫోన్..
భర్త పడుకున్న తర్వాత ప్రియుడిని పిలిచి.. ఇద్దరూ కలిసి హత్య చేశారు. ప్రియుడు హరీష్ భర్త శేకర్ గొంతు నులమగా.. చిట్టి డంబెల్ తో తలపై బాది హత్య చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సరూర్ నగర్ పోలీసులు తెలిపారు.
చిట్టి స్వస్థలం రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామం. భర్త శేఖర్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం మాధవరం గ్రామం. వృత్తి రీత్యా కారు డ్రైవింగ్ చేస్తూ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. వీరికి 2009 లో వివాహం అయ్యింది.