తమిళనాడు పొల్లాచ్చిలో పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ పేరిట బెదిరింపు లేఖ

తమిళనాడు పొల్లాచ్చిలో పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ పేరిట బెదిరింపు లేఖ

కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/న్యూఢిల్లీ: తమిళనాడు పొల్లాచ్చి టౌన్‌‌‌‌‌‌‌‌లో పెట్రోల్ బాంబులతో దాడి చేస్తామంటూ వచ్చిన బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. అలర్ట్ అయిన పోలీసులు గురువారం ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ‘‘మేము పోలీసులకు వ్యతిరేకం కాదు. కానీ, శాంతి భద్రతల సమస్యను సృష్టించాలనుకుంటున్నాం. పొల్లాచ్చి టౌన్‌‌‌‌‌‌‌‌లోని 16 చోట్ల పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బాంబులు వేస్తాం”అని ఆ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని పోలీసులు చెప్పారు.  ఆ లేఖను దుండగులు ఎస్‌‌‌‌‌‌‌‌డీపీఐ, పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ పేరుతో ఏకంగా పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌కే పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు.

కేసు విచారణ కోసం పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, టెర్రరిస్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థలతో లింకులున్నాయంటూ పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ట్విట్టర్​ అకౌంట్​ను అంతకుముందు రోజు బ్యాన్ చేసిన కేంద్రం.. గురువారం  ఆ అకౌంట్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తోందని ఆరోపించింది.