యూపీలో చివరి దశ పోలింగ్

యూపీలో చివరి దశ పోలింగ్
  • 350 సీట్లు గెలుస్తామని మంత్రి రవీంద్ర జైస్వాల్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ తుది దశ పోలింగ్ షురూ అయింది. తొమ్మిది జిల్లాల్లోని 54 నియోజకవర్గాల్లో 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఎన్నికలు.. ఇవాళ జరిగే ఏడో దశతో ముగియనున్నాయి. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న.. వారణాసి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇవాళ పోలింగ్ జరగుతోంది. ఈ నెల 10న యూపీ ఫలితాలు రానున్నాయి. అలాగే మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజున వెలువడనున్నాయి.

వారణాసిలో అన్ని సీట్లు మేమే గెలుస్తం

యూపీలో చివరి దశ పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయాన్నే పబ్లిక్.. పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల పోలింగ్ జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, పోలింగ్ సందర్భంగా ఓ బూత్ ను పరిశీలించిన యూపీ మంత్రి, వారణాసి నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవీంద్ర జైస్వాల్ మాట్లాడుతూ యూపీలో మళ్లీ అధికారం తమ పార్టీదేనని అన్నారు. వారణాసి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని సెగ్మెంట్లనూ తామే కైవసం చేసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా ఉన్న 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీనే 350 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‎డేట్స్

గవర్నర్​కు పోటీగా సర్కార్​ ప్రోగ్రామ్

ఏటా 10 శాతం స్కూల్​ ఫీజులు పెంచుకోవచ్చు!