పోలింగ్ రోజు కూడా డ్యూటీనే

పోలింగ్ రోజు కూడా డ్యూటీనే
  • ఓటుకు దూరంగా ఆర్టీసీ, రైల్వే కార్మికులు

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగిం చుకోవాలి.. ఓటే వజ్రాయుధం.. అంటూ ఎన్నికలొచ్చిన ప్రతీసారి ఎన్ని కల కమిషన్‌‌ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటుం ది. కానీ ఆర్టీసీ, రైల్వే కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిం చడం లేదు. ఒక్కరిద్దరు కాదు ఇలా వేల సంఖ్యలో ఉన్నారు. దశాబ్దా లుగా వారు ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నా ఎవరూ పట్టిం చుకోవడం లేదు.

 ఆఫీసుకు రావాల్సిందే…

ఆర్టీసీ కార్మికు లు ప్రతిసారి ఎన్ని కలకు దూరంగా ఉంటున్నా రు. ఆర్టీసీ బస్సులు తప్పనిసరిగా నడవాల్సి ఉండటంతో కార్మికు లు ఓటును వినియోగిం చుకోలేకపోతున్నారు. ఎన్నికల రోజు సాధారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తారు. కానీ ఆర్టీసీలో మాత్రం కార్యాలయాల్లో పనిచేసే స్టాఫ్‌ తప్పనిసరిగా విధుల్లోకి రావాల్సిందే. ఆ రోజు వీక్‌‌ ఆఫ్‌ ఉన్నవారిని మాత్రం మినహాయిస్తారు. అంతేకాకుండా ఎన్ని కల కోసం ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఉపయోగిం చుకుంటా రు. దీంతో అవసరమైతే వీక్‌‌ ఆఫ్‌ ఉన్న సిబ్బం దిని కూడా డ్యూటీకి రమ్మంటా రు. ఆర్టీసీలో సుమారు 20 వేలకు పైగా కార్మికు లు ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు. వీరిలో డ్రైవర్లు, కండక్టర్లు , మెకానిక్‌‌లు, ఇన్‌‌స్పెక్టర్లు ఇతర సిబ్బం ది ఉన్నారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి తమకు కూడా పోస్టల్‌‌ బ్యాలెట్‌ విధానాన్ని తీసుకురావాలని యూనియన్‌‌ నేతలు కోరుతున్నారు. ఎన్నికల రోజున ప్రత్యేక సెలవు ప్రకటిం చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రైల్వేలోనూ అంతే…

రైల్వేలో పనిచేస్తున్న కార్మికు లు కూడా ఓటును ఉపయోగించుకోలేకపోతున్నా రు. దక్షిణ మధ్య రైల్వేలో డ్రైవర్లు, గార్డులు, ఏసీ మెకానిక్‌‌లు, ఏసీ అటెండెంట్‌ లు, గ్యాంగ్‌‌మెన్‌‌లు తదితరులు సుమారు 18 వేల మంది వరకు ఓటు హక్కును వినియోగించు కోలేకపోతున్నా రు. వీరంతా పోలింగ్‌‌ రోజు కూడా తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సి ఉంటుం ది.వీరిలో చాలామంది మన రాష్ట్రంతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. వారి ఓటు వేర్వేరు చోట్ల ఉంటుంది. ఎన్నికల రోజున కూడా డ్యూటీకి రావాల్సి ఉన్నందున పోలింగ్ రోజు కూడా డ్యూటీనే ఇలాంటి వారు ఓటుకు దూరంగా ఉండిపోతున్నారు. రైల్వే కార్మికులకు కూడా ఓటేసేందుకు ప్రత్యేక విధానం తేవాలని యూనియన్ నేతలు కోరుతున్నా రు. ఆధార్‌‌ కార్డు, ఎంప్లాయ్‌ కార్డు ఉన్న కార్మికులు ఎక్కడ విధులు నిర్వహిస్తారో అక్కడే ఓటేసే సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు