బీసీలను నిర్లక్ష్యం చేస్తే..ఏ పార్టీకి మనుగడ లేదు

బీసీలను నిర్లక్ష్యం చేస్తే..ఏ పార్టీకి మనుగడ లేదు

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటా యించాలని ‘టీం ఓబీసీ’ లీడర్లు బుధవా రం పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మ య్యను కోరారు. అన్ని రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా అవ కాశాలు కల్పించాలన్నారు. ఈ సంద ర్భంగా పొన్నాల మాట్లాడుతూ, బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించకుం టే ప్రజల మద్దతు తగ్గిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలన్నారు. 

బీసీలను పట్టించుకోకుంటే ఏ పార్టీ మనుగడైనా కష్టమేనని, అందుకు కాంగ్రెస్ అతీతమేమీ కాదని తేల్చి చెప్పా రు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు పరిగణ నలోకి తీసుకోవాలన్నారు. వేరే రాజకీ య పార్టీల్లో బీసీలు గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్​లో మాత్రం ఎందుకు గెలవడం లేదని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.