రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్..

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్..

తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 18వ తేదీ సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో వేద పండితుల పూజ కార్యక్రమంతో మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. 

 ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయననుTSRTC ఎండీ వీసీ సజ్జనర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.