జ్ఞానవాపి మసీదు సెల్లార్‌‌‌‌లో పూజలు

జ్ఞానవాపి మసీదు సెల్లార్‌‌‌‌లో పూజలు

 వారాణాసి: ఉత్తరప్రదేశ్‌‌లోని జ్ఞానవాపి మసీదులోని బేస్‌‌మెంట్‌‌లో ఉన్న హిందూ దేవుళ్ల విగ్రహాలకు భక్తులు పూజలు నిర్వహించారు. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుతో భక్తులు బుధవారం అర్ధరాత్రి 12.00 గంటలు దాటాక ఆలయాన్ని తెరిచారు. అనంతరం గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పూజలు నిర్వహించారు. సెల్లార్‌‌‌‌లో ఉన్న విష్ణు, లక్ష్మి, గణపతి, రెండు హనుమాన్‌‌ విగ్రహాలకు పూజరులు హారతి ఇచ్చారు. ఇకపై ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అన్ని రకాల పూజలు నిర్వహిస్తామని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్‌‌ అధ్యక్షుడు నగేంద్ర పాండే తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ పూజలు ప్రారంభించామన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. తాము సెల్లార్‌‌‌‌ను తెరిపించామని, దీంతో వెంటనే భక్తులు అక్కడున్న దేవుళ్ల విగ్రహాలకు పూజలు చేశారని జిల్లా కలెక్టర్‌‌‌‌ రాజ్‌‌లింగం తెలిపారు.