కరోనాపై ‘పూల్ టెస్టింగ్’

కరోనాపై ‘పూల్ టెస్టింగ్’
  • తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి టెస్టులు: ఐసీఎంఆర్ ప్రతిపాదన

న్యూఢిల్లీ: తక్కువ ఖర్చుకే ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేయడానికి ఐసీఎంఆర్ పూల్ టెస్టింగ్ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఐదుగురి నుంచి శాంపిల్స్ సేకరించి ఒకేసారి టెస్టింగ్ చేయడం వల్ల కాస్ట్ తగ్గుతుందని పేర్కొంది. టెస్ట్ రిజల్ట్ నెగెటివ్ వస్తే ఐదుగురికి నెగెటివ్ ఉన్నట్లే. ఒకవేళ టెస్టింగ్ లో పాజిటివ్ వస్తే ఒక్కొక్కరికి విడిగా టెస్టు చేయవచ్చని తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్ టెస్టింగ్ అవసరమని పేర్కొంది. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేయాలని, 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న చోట ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాలని అడ్వైజరీలో పేర్కొంది. దీనిపై లక్నోకు చెందిన కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ స్టడీ చేసి సిఫార్సు చేసినట్లు వెల్లడించింది. హెల్త్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ రావాల్సి ఉందని పేర్కొంది.

కరోనాపై రెమ్ డెసివిర్ డ్రగ్ పని చేస్తోంది: ఐసీఎంఆర్

కరోనా వైరస్ పై యాంటీ వైరస్ డ్రగ్ రెమ్ డెసివిర్ ఎఫెక్టివ్ గా పని చేయవచ్చని ఐసీఎంఆర్ వెల్లడించింది. డబ్ల్యూ హెచ్ ఓ సాలిడారిటీ ట్రయల్ లో ఇది తేలాల్సి ఉందని ప్రకటించింది. వెంటిలేటర్ పై ఉన్న ముగ్గురు పేషెంట్లలో ఇద్దరికి ఇది పని చేసిందని న్యూ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఓ స్టడీని పబ్లిష్ చేసిందని తెలిపింది. దీనిపై ఐసీఎంఆర్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనికేబల్ డిసీజెస్ హెడ్ రామన్ రఆర్ గంగాఖేడ్కర్ మాట్లాడుతూ.. ఎబోలా వైరస్ ట్రీట్ మెంట్ కు ఈ డ్రగ్ ను వాడినట్లు చెప్పారు. కరోనా ట్రీట్ మెంట్ లోనూ ఇది ఎఫెక్టివ్ గా పని చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. అయితే స్టడీలో చెప్పిన ప్రకారం ఇది క్లినికల్ ట్రయల్ కాదని, ఓ అబ్జర్వేషన్ మాత్రమేనని చెప్పారు. ముగ్గురిలో ఇద్దరికి ఈ డ్రగ్ వాడిన తర్వాత వాళ్లకు వెంటిలేటర్ అవసరం ఏర్పడలేదన్నారు. రెమ్ డెసివిర్ మెడిసిన్ ను గిలీడ్ సైన్సెస్ ఇంక్ కంపెనీ డెవలప్ చేసిందని, దేశంలో ప్రస్తుతం ఇది అందుబాటులో లేదన్నారు. మన దేశంలోని ఏదైనా ఫార్మా సంస్థ ఈ మెడిసిన్ ను తయారు చేస్తే ట్రీట్ మెంట్ కు వాడొచ్చని చెప్పింది.