Rajinikanth : చంద్రబాబుతో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ భేటీ

Rajinikanth : చంద్రబాబుతో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ భేటీ

హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌  తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు.వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోను చంద్రబాబు ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

‘‘నా ప్రియమైన స్నేహితుడు తలైవా రజనీకాంత్‌ను కలిసి, ముచ్చటించడం చాలా ఆనందంగా ఉంది’’ అని చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే ఆ ఫొటో వేల లైక్స్‌, రీట్వీట్‌లతో వైరల్‌గా మారింది.

‘వీరిద్దరూ ఎప్పటినుంచో మంచి స్నేహితులు’ అని కొందరు నెటిజన్లు సంబంధిత ఫొటోలతో నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. మరికొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. మొన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయిన చంద్రబాబు తాజాగా రజనీకాంత్‌తో కూడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.