
జగన్ చావాలని టీడీపీ వాళ్లు కోరుకుంటున్నారని.. ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఎవరి సపోర్ట్ అవసరం లేదని.. ప్రజలు అండగా ఉంటే చాలని అన్నారు. బీఆర్ఎస్ కి వైసీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. కుండలు తయారుచేసే వాడు అమ్ముకోవాలి కానీ.. దాన్ని తన్న కూడదన్నారు. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే.. టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదని నిలదీశారు.
చంద్రబాబు జైల్ లో ఉంటే పవన్ ధీమాగా టీడీపీకి సపోర్ట్ చేస్తే.. టీడీపీ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేసిందని మండిపడ్డారు. కాపు సోదరులారా ఇదంతా గమనించాలని.. చంద్రబాబు కాపులని, పవన్ కల్యాణ్ ని ముంచుతాడని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి పోటీ చేయొచ్చు కదా.. చంద్రబాబుకి కాపు ఓట్లు కావాలి కానీ, అధికారం మాత్రం కాపులకి ఇవ్వడని పోసాని ఆరోపించారు. తెలంగాణలో జనసేన గెలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సీట్లు అడుగుతాడని.. చంద్రబాబు జనసేనకి సపోర్ట్ చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబుకి బుద్ది ఉందా.. గతంలో 23 ఎమ్మెల్యేలని ఎందుకు కొన్నావని ఆరోపించారు. చంద్రబాబు చేసేదంతా ప్రజలకు ఇప్పటికే అర్థం అవుతుందిని పోసాని తెలిపారు.