వారంలో పూర్తి క్లారిటీ: ఆనందయ్య కరోనా మందుపై ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్ట్‌

వారంలో పూర్తి క్లారిటీ: ఆనందయ్య కరోనా మందుపై ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్ట్‌

మందు తయారీ విధానంలో శాస్త్రీయత పరిశీలిస్తాం
అధ్యయనం తర్వాత నివేదికకు వారం రోజులు-ఆయుష్‌ కమిషనర్‌ రాములు

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. ఆన ముందే ఆయుర్వేద మందు తయారీని ఆనందయ్య చూపించనున్నట్లు తెలిపారు రాములు. ఈ సందర్భంగా శ‌నివారం మీడియాతో మాట్లాడిన రాములు.. క‌రోనా మందుపై ముత్తుకూరులో కొంతమందితో, ఆనందయ్య వద్ద పనిచేసేవారితో మాట్లాడామని తెలిపారు. ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారో పరిశీలిస్తామని  తెలిపారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని.. మందు తయారీ పదార్థాలపై ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్టే వచ్చిందని చెప్పారు.  ఆనందయ్య మందును తీసుకున్నవారి అభిప్రాయాలనూ సేకరిస్తామన్నారు. ఐసీఎంఆర్ టీమ్ పరిశీలిన తర్వాత వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటామన్నారు.  మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం రోజులు పడుతుందని రాములు తెలిపారు. 
అప్పటివరకు కృష్ణపట్నం రావద్దు: జేసీ
ఆనందయ్య ఆయుర్వేద మందుపై సీఎంఆర్, ఆయూష్‌ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జేసీ హరేంద్రప్రసాద్ తెలిపారు. నివేదిక వచ్చేందుకు వారం, 10 రోజులు పట్టొచ్చని.. ఫైనల్ గా ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే మందు పంపిణీ చేపడతామని తెలిపారు. అప్పటి వరకు ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని జేసీ చెప్పారు.