పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్), చండీగఢ్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్/ జూనియర్ డెమానిస్ట్రేటర్.
మొత్తం ఖాళీలు: 134.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉండాలి. కేంద్ర/ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎంసీఐ -గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ ఎంఎస్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 45ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 25.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీలకు రూ.800. పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మే 11.
కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ తేదీ: మే 22.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ pgimer.edu.in ను సందర్శించండి.

