పూడ్చిన డెడ్ బాడీకి పోస్టుమార్టం..కొడుకు మృతిపై పోలీసులకు తండ్రి కంప్లయింట్

పూడ్చిన డెడ్ బాడీకి పోస్టుమార్టం..కొడుకు మృతిపై పోలీసులకు తండ్రి కంప్లయింట్
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఘటన

జూలూరుపాడు,వెలుగు: పూడ్చి పెట్టిన డెడ్ బాడీని వెలికి తీసి పోస్టుమార్టం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన ప్రకారం.. జూలూరుపాడు ఎస్సీ కాలనీకి  చెందిన కత్తి అరవింద్(26) గత నెల 7న నూడుల్స్​తిని అస్వస్థతకు గురికాగా ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అదే నెల16న చనిపోయాడు. డెడ్ బాడీని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు.

తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి రాములు ఈనెల 4న స్థానిక పోలీస్​ స్టేషన్​లో కంప్లయింట్ చేశాడు. జూలూరుపాడు పోలీసులు మంగళవారం డెడ్ బాడీని వెలికితీశారు. తహసీల్దార్ స్వాతి బిందు సమక్షంలో కొత్తగూడెం ఫోరెన్సిక్ డాక్టర్ రమణమూర్తి పోస్టుమార్టం చేశారు.   రిపోర్ట్ వచ్చాక తగు చర్యలు తీసుకుంటామని సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.