వెనుకబడిన కులాల పిటిషన్ పై విచారణ వాయిదా

వెనుకబడిన కులాల పిటిషన్ పై విచారణ వాయిదా
  •  సుప్రీంను ఆశ్రయించిన 28 వెనుకబడిన కులాలు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఓబీసీ జాబితా నుంచి తమను తప్పించిదంటూ 28 వెనుకబడిన కులాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వా త పలు కులాలను అప్పటి ప్రభుత్వం ఓబీసీ జా బితా నుంచి తొలగించింది. ప్రభుత్వ నిర్ణయంతో రిజర్వేషన్ల విషయంలో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని సుమారు 28 కులాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బుధవారం ఈ పిటిషన్లపై జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ఎన్ వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

స్థానిక కమిషన్ తో సహా ఎవరూ సిఫార్సు చేయనప్పటికీ ఓబీసీ జాబితా నుంచి తమను రాష్ట్ర ప్రభుత్వం తప్పించిందని పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు బెంచ్ కు వివరించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సుప్రీంకోర్టులో రాష్ట్ర న్యాయవాదుల ప్యానెల్‌‌‌‌ మారిందని, అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని బెంచ్ కు నివేదించారు. అందువల్ల విచారణకు మూడు వారాలు గడువు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.