Telangana Kitchen: ఆలూతో వెరైటీ కర్రీస్.. టేస్ట్ అదిరిద్ది.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు..

Telangana Kitchen: ఆలూతో వెరైటీ కర్రీస్.. టేస్ట్ అదిరిద్ది.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు..

కూరగాయల మార్కెట్​ కు వెళితే చాలు.. సంచిలో ఆలూ లేకుండా ఉండదు.  అంటే కిచెన్​ ఆలూ ఎంత ముఖ్యమో అందరకు తెలిసిందే.. అలాంటి ఆలుగడ్డలతో ఏ రకం వంట చేసినా సూపర్​ .. అని తింటారు. వంక పెట్టకుండా తినే వంటకాలంటే ఆలు వెరైటీస్ అనే చెప్పొచ్చు. అలాంటి ఆలుతో  కొన్ని వెరైటీలు చేయండి. ఆవురావురుమంటూ తినేస్తారు.. ఇప్పుడు అలాంటి వంటకాలు మీకోసం. . . .

చిల్లీ ఆలు ... ఇలా తయారు చేయండి.. సూపర్​ టేస్ట్​..

  • నూనె: ఒక టేబుల్​ స్పూన్​ 
  • ఉల్లిగడ్డ తరుగు: పావు కప్పు
  • వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు: ఒక్కోటి రెండు టీస్పూన్లు 
  • క్యాప్సికం: పావు కప్పు
  • సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ లేదా రెడ్ చిల్లీ పేస్ట్: ఒక్కోటి రెండు టేబుల్
  • స్పూన్లు చొప్పున నీళ్లు: కొద్దిగా
  •  వెనిగర్, చక్కెర, ఉప్పు: తగినంత 
  • మిరియాల పొడి: కొద్దిగా (రావాలనుకుంటే)
  • స్ప్రింగ్ ఆనియన్స్: కొన్ని
  •  నువ్వులు: ఒక టీ స్పూన్ (కావాలనుకుంటే)

తయారీ విధానం: ఆలుగడ్డలను శుభ్రం చేసి పొట్టు తీసి సన్నగా పొడవుగా తరగాలి. తర్వాత ఒక గిన్నెలో 3 కప్పుల చల్లటి నీళ్లు పోసి తరిగిన ఆలు ముక్కలు వేసి అరగంట ఉంచాలి. తర్వాత నీళ్లు వంపి ఒక గిన్నెలోవేయాలి. ఎండు మిర్చి ఫ్లేక్స్, కాశ్మీరి ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. తరువాత పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేడిచేయాలి. నూనె వేడయ్యాక ఆలుగడ్డ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఆలు గడ్డలకు పట్టించాక కార్న్ ఫ్లోర్ మిగిలింది పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ లేదా పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. తరువాత పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేడి చేశాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. తరువాత ఉల్లిగడ్డ, క్యాప్సికం తరుగు వేసి వేయాలి. ఇందులో పాస్లను వేసి కలపాలి. అది ఉడుకుతున్నప్పుడు పక్కన పెట్టిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కలిపి మిరియాలపొడి, ఉప్పు, చక్కెర వేయాలి. తరువాత ముందుగా వేగించి పెట్టిన ఆలు వేసి ఒకసారి గరిటెతో అటు ఇటు కలపాలి... పొయ్యి ఆవేసి పై నుంచి స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు. నువ్వులు చల్లాలి. చివరిగా వెనిగర్ వేయాలి

 ఆలు, రవ్వ ఫింగర్స్​ ఎలా తయారు చేయాలంటే..

  • ఉప్మారవ్వ: అర కప్పు
  • గట్టి పెరుగు: పావు కప్పు
  • ఉడికించిన ఆలు: 2
  • పచ్చిమిర్చి తరుగు: 1 టేబుల్​ స్పూన్​
  • అల్లం వెల్లుల్లి ముద్ద: అర టీస్పూన్ 
  • చాట్ మసాలా: అర టీస్పూన్
  • జీలకర్రపొడి: అర టీస్పూన్ (వేగించి)
  • మిరియాలపొడి: అరటీస్పూన్ 
  • ఉప్పు: తగినంత 
  • కార్న్ ఫ్లోర్: పావుకప్పు 
  • నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం : రవ్వను వేగించి పక్కన పెట్టాలి. ఒక పెద్ద గిన్నెలో రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. పావు గంట నానబెట్టాలి. తర్వాత ఉడికించిన ఆలుని తీసుకొని మెత్తగా చేసి రవ్వ మిశ్రమంలో కలపాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద, చాట్ మసాలా, జీలకర్రపొడి, మిరియాలపొడి, సాల్ట్ వేసి చపాతీ పిండి ముద్దలా కలపాలి. ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేశాక, వాటిని పొడవుగా వేళ్ల సైజులో చేయాలి. ఒక ప్లేటులో మైదాపిండి తీసుకొని ఆ ఫింగర్స్ ను అందులో దొర్లించి పక్కన పెట్టాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేడి చేయాలి. తయారు చేసిన ఫింగర్స్ ను వేసి గోల్ రంగు వచ్చే వరకు వేగించాలి. వీటిని టొమాటో సాస్​ తో  తింటే బాగుంటాయి.

ఆలు 65 ఇలా తయారు చేయండి

  • ఆలుగడ్డలు: మీడియం సైజువి ఐదు
  • మైదా లేదా గోధుమ పిండి : 3 టేబుల్ స్పూన్లు
  • కరివేపాకు: 8రెబ్బలు
  •  కారం: ఒక టీస్పూన్
  • కొత్తిమీర తరుగు: ఒక టీస్పూన్
  • జీలకర్రపొడి, మిరియాలపొడి, గరం మసాలా: ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
  •  అల్లం వెల్లుల్లి ముద్ద: 2లేదా 3 టీస్పూన్లు
  •  పుదీన: కొద్దిగా 
  • నీళ్లు: సరిపడినంత 
  • ఉప్పు, నూనె: తగినంత 

తయారీ విధానం :  కుక్కర్​ లో  నీళ్లు పోసి ఆలుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత ఆలుగడ్డల పొట్టు తీసి ముక్కలు తరిగి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో కరివేపాకు, కారం, కొత్తిమీర (సన్నగా తరిగినది), జీలకర్ర పొడి, గరం మసాల, అల్లంవెల్లుల్లి ముద్ద, పుదీనా ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో నీళ్లు పోసి దోశెపిండి కంటే కొంచెం పలుచగా కలపాలి. ఆలుగడ్డ ముక్కలను తీసుకొని ఆ పిండిలో వేయాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేడి చేయాలి. తరువాత ఆలు గడ్డ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. వీటిని టొమాటో సాస్​ తో  తింటే టేస్టీ టేస్టీగా ఉంటాయి.

►ALSO READ | Vastu Tips : కింద సింగిల్ బెడ్ రూం.. పైన డబుల్ బెడ్ రూం కట్టుకోవచ్చా.. డ్రేనేజీ వాటర్ ఎటు నుంచి బయటకు పోవాలి