మేడారంలో ఘనంగా పొట్ట పండుగ

మేడారంలో ఘనంగా పొట్ట పండుగ

తాడ్వాయి,వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలకు పొట్ట పండుగను ఘనంగా నిర్వహించారు. కొత్తగా పండించిన మొక్కజొన్న, వరి కంకులతో పాటు వివిధ రకాల విత్తనాలను సేకరిస్తారు. వాటిని డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామ పెద్దలు, ఆడపడుచులు కలిసి తీసుకెళ్లి సమ్మక్క గుడిలో పెట్టి  ప్రత్యేకంగా పూజిస్తారు. 

అనంతరం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులు, పూజారుల కుటుంబాలు మొక్కులు చెల్లించుకుంటారు. రాత్రంతా గుడిలో జాగారాలు చేస్తారు. ఇంతటితో పొట్ట పండుగ ముగుస్తుంది. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునేందర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.