నేడు కరెంటు ఉండని ప్రాంతాలు

నేడు కరెంటు ఉండని ప్రాంతాలు

కంటోన్మెంట్‌‌, వెలుగు: బోయిన్ పల్లి హెచ్ఎంటీ సబ్​స్టేషన్‌‌లో చేపట్టిన మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆ పరిధిలోని ప్రాంతాల్లో బుధవారం కరెంటు సప్లయ్ నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్​డివిజనల్ ​ఇంజినీర్ శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ఏవోఎల్ ​ఫీడర్ ​పరిధి హెచ్ఎంసీ సబ్​స్టేషన్, చింతల్ ​ఫీడర్​లోని హెచ్ఎంటీ మెయిన్​రోడ్, అయ్యప్ప స్వామి టెంపుల్​ ఏరియా హెచ్ఎంసీ ఫీడర్​పరిధి హెచ్ఎంటీ కాలనీ, శ్రీసాయి కాలనీ ఫీడర్​పరిధి భరత్​నగర్, శ్రీసాయి కాలనీ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.