మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

మెక్సికోలో నిన్న(మంగళవారం, జూన్-23) 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:29 గంటలకు సంభవించిన ఈ భూకంపానికి ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో పలు భవనాలు కంపించాయి. భూ ప్రకంపనలతో అప్రమత్తమైన అధికారులు ఆస్పత్రుల నుంచి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని.. ఆక్సాకా స్టేట్ పసిఫిక్ తీరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మెక్సికోతో పాటు మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా దాదాపు నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. మెక్సిలో మూడేళ్ల క్రితం సంభవించిన భారీ భూకంపంలో 355 మంది చనిపోయారు.