Kalki 2898 AD: రొమాంటిక్ నేచర్లో ప్రభాస్, దిశా..ఫ్యాన్స్ కోసం భళే ప్లాన్ చేశారుగా

Kalki 2898 AD: రొమాంటిక్ నేచర్లో ప్రభాస్, దిశా..ఫ్యాన్స్ కోసం భళే ప్లాన్ చేశారుగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD). టాలీవుడ్లో క్రియేటీవ్ డైరెక్టర్గా పేరుతెచ్చుకున్న నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో కల్కి పాటల నగారా మోగించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

రీసెంట్గా ఇండియాలో పలు కీలక షెడ్యూల్స్ను కంప్లీట్ చేసుకున్న చిత్ర బృందం..ఇటీవలే ఇటలీకి పయనమయ్యినట్లు అక్కడే ఆటాపాటా మొదలు..అంటూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.అక్కడ ప్రభాస్ అండ్ దిశా పటాని (Disha Patani)పై మూవీలోని చివరి సాంగ్ని షూట్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఆ షూటింగ్ కి సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్ షేర్ చేస్తూ ఆడియన్స్ లో హుషారు పెంచుతూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే  తాజాగా మూవీ లొకేషన్ లో ఉన్న ప్రభాస్ అండ్ దిశా పటాని ఫోటోని మేకర్స్ షేర్ చేసారు. ఆ పిక్ లో ప్రభాస్ లుక్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి.ఇక దిశా తన మెస్మరైజింగ్ లుక్స్ తో ఫ్యాన్స్ కు మత్తెక్కిస్తోంది. అయితే,ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ ఫొటోలోప్రభాస్ రెడ్ కలర్ షర్ట్ ధరించి, బ్లాక్ జాకెట్ తో ఉండగా..దిశా గ్రే కలర్ దుప్పటి లాంటి షీట్‌తో కప్పుకుని ఉంది.

ఇన్నాళ్లు సరైన అప్డేట్ లేదంటూ ఫ్యాన్స్..బాగా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఒక్క రొమాంటిక్ సాంగ్ అప్డేట్స్ తోనే భలే కిక్కుస్తున్నారు నాగ్. ఏదేమైనా ప్రభాస్ దిశాతో చిందేస్తే చూడాలని ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇక తొందరగా కానిచ్చెయండి బాస్.

కాగా ఇవాళ శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ లేదా సాంగ్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు ఏంటనేది ఇవాళ సాయంత్రం 5 గంటలకు రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ షురూ చేశారు. 

ఇప్పటికే రిలీజ్ చేసిన కల్కి గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసిన డైరెక్టర్ నాగ్..మరి సాంగ్స్ తో ఎలాంటి కొత్తదనం చూపించబోతున్నాడో తెలియాల్సి ఉంది. కల్కి ట్రైలర్ ఏప్రిల్ 9న వచ్చే అవకాశం ఉంది. 

ALSO READ :- లవర్స్ చీటింగ్ ఐడియా : పోలీస్ ఉద్యోగాల పేరుతో రూ.3 కోట్లు దోచుకున్నారు


ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో, ఇండియన్ మైథాలజీకి లింక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో రాబోతుంది.