Prabhas: ప్రభాస్ బర్త్‌‌డే వచ్చేస్తోంది డార్లింగ్స్.. ఏకంగా ట్రిపుల్ ట్రీట్తో రెబల్ ధమాకా

Prabhas: ప్రభాస్ బర్త్‌‌డే వచ్చేస్తోంది డార్లింగ్స్.. ఏకంగా ట్రిపుల్ ట్రీట్తో రెబల్ ధమాకా

మరో వారంలో (అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్‌‌డే రానున్న సందర్భంగా రెబల్  ఫ్యాన్స్ అంతా ఆయన మూవీ అప్‌‌డేట్స్ కోసం ఈగర్‌‌‌‌గా వెయిట్‌‌ చేస్తున్నారు. అయితే ఈసారి అభిమానుల కోసం ఏకంగా ట్రిపుల్ ట్రీట్‌‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం వరుస పాన్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వీటిలో మారుతి రూపొందిస్తున్న ‘రాజా సాబ్‌‌’,  పాటు హను రాఘవపూడి రూపొందిస్తున్న ‘ఫౌజీ’ చిత్రాలు సెట్స్‌‌పై ఉన్నాయి.

ఇప్పటికే ‘రాజా సాబ్’ ట్రైలర్‌‌‌‌తో అంచనాలు పెంచిన టీమ్.. ప్రభాస్ బర్త్‌‌డే సందర్భంగా ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ గ్రీస్‌‌లో జరుగుతోంది. అలాగే  హను రాఘవపూడి రూపొందిస్తున్న ‘ఫౌజీ’ మూవీకి సంబంధించి స్పెషల్ సర్‌‌‌‌ప్రైజ్ ఉండబోతుందని డైరెక్టర్ తెలియజేశాడు. అది టైటిల్​ గురించా, ప్రభాస్​ ఫస్ట్​ లుక్ రిలీజ్​ అవుతుందా అన్నది ఆ రోజే క్లారిటీ రానుంది.

మరోవైపు ‘బాహుబలి’ రీ రిలీజ్ ట్రైలర్‌‌‌‌ను ప్రభాస్ పుట్టినరోజు రిలీజ్ చేయనున్నారు. ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న తిరిగి థియేటర్లలోకి ఈ చిత్రం రానుంది. అలా  ఈసారి ప్రభాస్ బర్త్‌‌డే ఫ్యాన్స్‌‌కు ట్రిపుల్ ధమాకా కాబోతోంది.

ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్‌‌లో సందీప్ రెడ్డి వంగా రూపొందించనున్న ‘స్పిరిట్’తో పాటు ప్రశాంత్ నీల్‌‌తో ‘సలార్ 2, నాగ్ అశ్విన్  ‘కల్కి2’ చిత్రాలు ఉన్నాయి. వీటిలో నుంచి ఏదైనా స్పెషల్ సర్‌‌‌‌ప్రైజ్ వస్తుందేమో చూడాలి.