
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి జై శ్రీరామ్ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. సికింద్రాబాద్ రాణిగంజ్ నుండి తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరాం, జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ప్రభాస్ ఫ్యాన్స్.. "టాలీవుడ్ లో గానీ బాలీవుడ్ లో గానీ.. శ్రీ రాముడు వేషధారణ ప్రభాస్ కు తప్ప ఇంకెవరికీ సరిపోదని, ఆదిపురుష్ సినిమా 2000 కోట్లను వసూలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుత యువత చెడు మార్గంలో నడుస్తుందని, ఆదిపురుష్ సినిమా చూసి శ్రీ రాముని మార్గంలో నడవాలని సూచించారు. ఇక శ్రీ రాముడికి వానర సైన్యం ఎలాగో మా ప్రభాస్ కు మా ఫ్యాన్స్ అలాగే ఉందని ఫ్యాన్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ బైక్ ర్యాలీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.