Prabhas: ప్రభాస్ ధరించిన జాకెట్ ధర అంతనా! రాజు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే

Prabhas: ప్రభాస్ ధరించిన జాకెట్ ధర అంతనా! రాజు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898AD). టాలీవుడ్లో క్రియేటీవ్ డైరెక్టర్గా పేరుతెచ్చుకున్న నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

రీసెంట్గా ఇండియాలో పలు కీలక షెడ్యూల్స్ను కంప్లీట్ చేసుకున్న చిత్ర బృందం..ఇటీవలే ఇటలీకి పయనమయ్యిన విషయం తెలిసిందే. అక్కడ ప్రభాస్ అండ్ దిశా పటాని (Disha Patani)పై రొమాంటిక్ సాంగ్ని షూట్ చేస్తున్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే మూవీ లొకేషన్ లో ఉన్న ప్రభాస్ అండ్ దిశా పటాని ఫోటోని మేకర్స్ షేర్ చేసారు. ఆ పిక్లో ప్రభాస్ లుక్స్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తున్నాయి.ఇక దిశా తన మెస్మరైజింగ్ లుక్స్ తో ఫ్యాన్స్ కు మత్తెక్కిస్తోంది.

అయితే మేకర్స్ షేర్ చేసిన ఫొటోలోప్రభాస్ రెడ్ కలర్ షర్ట్ ధరించి, బుర్బెర్రీ బ్లాక్ జాకెట్తో ఉండగా..దిశా గ్రే కలర్ దుప్పటి లాంటి షీట్‌తో కప్పుకుని ఉంది. ఇప్పుడు నెటిజన్స్ దృష్టి అంత ప్రభాస్ వేసుకున్న జాకెట్‌ పై పడింది. బ్లాక్ జాకెట్ ధర ఎంత అనే వివరాలు తెలిస్తే  సగటు సాధారణ మనుషులకి షాకింగ్ గా ఉంటోంది. అయితే ఈ జాకెట్ ధర రూ. 76,000 అని తెలిసింది. దీంతో ప్రభాస్ అంటేనే రాజు..ఇక ఆ మాత్రం ధర ఉండదా అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే..నిన్న మహా శివరాత్రి (మార్చి 8) సందర్భంగా కల్కిలో ప్రభాస్ పాత్ర పేరును అనౌన్స్ చేశారు. భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు కాశీలో భైరవ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించాడు. గాగుల్స్, స్లీవ్ లెస్ డ్రెస్ ..కండలు తిరిగిన దేహంపై టాటూ, పోనీటైల్ హెయిర్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాడు. ప్రస్తుతం కల్కి  భైరవ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.