Sai Pallavi Dance:స్టెప్పులతో అదరగొట్టిన సాయి పల్లవి..ఇదెక్కడి డాన్స్ రా బాబు!

Sai Pallavi Dance:స్టెప్పులతో అదరగొట్టిన సాయి పల్లవి..ఇదెక్కడి డాన్స్ రా బాబు!

సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవి (Sai Pallavi)కి సపరేట్ క్రేజ్ ఉంది. గ్లామర్ డోస్ ఇవ్వకుండా తన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం సినిమాల్లోనే కాదు బయట ఆమె నడుచుకునే తీరు ఎంతోమందికి నచ్చుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ కేరళ కుట్టి అజాత శత్రువనే చెప్పాలి. చాలా సింపుల్గా ఉంటూ ఇప్పటివరకు తనపై ఎలాంటి విమర్శలు లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్(Amir khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan). ఈ మూవీని సునీల్ పాండే డైరెక్ట్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం జపాన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ చిత్రబృందం చేసుకున్న పార్టీలో సాయి పల్లవి తనదైన డ్యాన్స్ తో అదరగొట్టేసింది. చుట్టూరా తన ఫ్రెండ్స్ అరుస్తుండగా..స్మైల్ ఇస్తూ సాయి పల్లవి డ్యాన్స్తో కుమ్మేసింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

యశ్‌రాజ్‌ ఫిలింస్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ మూవీతో జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రి ఇస్తున్నాడు. ఈ మూవీలో సాయి పల్లవి నటిస్తుండటంతో..తెలుగు సినీ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య తో కలిసి తండేల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.