
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కల్కి మరికొన్ని గంటల్లోనే (ఆగస్ట్ 22) ఓటీటీలోకి రాబోతుంది. రెండు ఓటీటీల్లో, ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కల్కి స్ట్రీమింగ్ కి అందుబాటులో రానుంది. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది.
తాజాగా కల్కి 2898 AD మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న కొన్ని గంటల ముందు ప్రైమ్ వీడియో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. అదేంటంటే..కల్కి మూవీ సెకండ్ పార్ట్ లో ఏం జరగబోతోందో అని ఊహించి ఫ్యాన్స్ క్రియేట్ చేసిన కొన్ని థియరీలు. వీటికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సమాధానాలు చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. నిజానికి స్టోరీ గురించి ఫ్యాన్స్ వేసిన అంచనాలు చాలా ఇంట్రెస్టింగా ఉన్నాయి. వీలైతే సినిమా చూసే ముందు ఓ సారి వీడియో చూసేయండి.
Also Read :- సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు.. ముఖ్య అతిధిగా ఎవరంటే ?
debunked or not, fan theories are always welcome ?#Kalki2898ADOnPrime, August 22 pic.twitter.com/nCXD48Lwni
— prime video IN (@PrimeVideoIN) August 20, 2024
ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్, వాటిని నాగ్ అశ్విన్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.విడుదలైన15 రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాకి ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం.
the world of Kalki 2898-AD at a glance ?#Kalki2898ADOnPrime, Aug 22 pic.twitter.com/hxg0H60Lv7
— prime video IN (@PrimeVideoIN) August 21, 2024